నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం

ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని ఏటా మే 3న జరుపుకుంటాం. పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యతను తెలియజేయడానికి, దానిని పరిరక్షించడానికి, విధుల్లో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు నివాళి అర్పించడానికి ఈ రోజును కేటాయించారు. ఆఫ్రికాలో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలకు వ్యతిరేకంగా 1991లో జర్నలిస్టుల నిరసనల ఫలితంగా ఐక్యరాజ్యసమితి మే 3ను ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవంగా ప్రకటించింది.