ఆదివాసీలకు కేంద్రమంత్రి కీలక హామీ

శ్రీకాకుళం: పాతపట్నంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. గతంలో గిరిజనులు టీడీపీని ఎప్పుడూ ఆదరించలేదని తెలిపారు. 2024లో మాత్రం ఎక్కువ సీట్లలో కూటమిని గెలిపించారని గుర్తు చేశారు. గిరిజనుల కోసం ఏడాదిలో రూ.8,189 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయం తెస్తామని హామీ ఇచ్చారు.