'తెలంగాణ ఉద్యమకారుల సభను విజయవంతం చేయాలి'
SRPT: కోదాడ పట్టణంలోని స్థానిక అమ్మ మెడికల్ ఏజెన్సీ వద్ద కోదాడ నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారుల సమావేశం ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుండె పంగు రమేష్ మాట్లాడుతూ.. రేపు హైదరాబాద్ లోని తార్నాకలో మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ లో జరగబోయే తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం సభను విజయవంతం చేయాలని నియోజకవర్గ ఉద్యమకారులకు పిలుపునిచ్చారు.