'హలో బీసీ.. ఛలో ఢిల్లీ': ఆర్‌ కృష్ణయ్య

'హలో బీసీ.. ఛలో ఢిల్లీ': ఆర్‌ కృష్ణయ్య

TG: తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో తీవ్రతరం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య తెలిపారు. చట్టసభల్లో 50% రిజర్వేషన్ల సాధన కోసం నిర్వహించనున్న 'హలో బీసీ.. ఛలో ఢిల్లీ' కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఓబీసీ ప్రధానిగా ఉన్న ఈ సమయంలోనే బీసీ హక్కులను సాధించుకోవాలన్నారు.