రైతు సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం: డిప్యూటీ స్పీకర్
W.G: రైతు సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు తెలిపారు. కాళ్ళ మండలం కోపల్లె సొసైటీలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వంలో మాదిరిగా రైతులు ధాన్యం డబ్బులు కోసం నెలలు తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. రైతు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్నారు.