నూతన పెన్షన్లు పంపిణీ కార్యక్రమం

NDL: మండల కేంద్రమైన జూపాడు బంగ్లాలో గ్రామ సర్పంచ్ మొట్టె బాలయ్య ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన నూతన పెన్షన్‌లు అధికారులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి ఇవాళ ఇంటింటికీ తిరుగుతూ అర్హులైన వారికి పంపిణీ చేయడం జరిగిందన్నారు. నూతన పెన్షన్ తీసుకున్న వారు సంతోషం వ్యక్తం చేశారని, పేర్కొన్నారు. MPTC, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.