గీతం యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
VSP: రుషికొండ గీతం యూనివర్సిటీ ఎదుట వైసీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు వెంటేశ్వరస్వామి ఆలయం నుంచి గీతం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, యూనివర్సిటీ ఎదుట బైఠాయించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గీతం నుంచి ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు.