నక్షా రోడ్డుపై రెవెన్యూ అధికారుల సర్వే
MDK: తూప్రాన్ పట్టణ పరిధి వెంకటాపూర్ (పీటీ) నక్షా రోడ్డు గుర్తింపుకై రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. బ్రాహ్మణపల్లి రైల్వే స్టేషన్ నుంచి దొంతి వరకు నక్ష రోడ్డు ఉండేదని గ్రామస్తులు పేర్కొంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఇవాళ ఆర్ఐ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు సర్వే నిర్వహించి నక్ష రోడ్డు హద్దులను ఏర్పాటు చేశారు.