గ్రామాల్లో అన్ని సమస్యలను పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే
CTR: గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి పెడుతున్నట్లు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం పుంగనూరు మండలలోని 11 పంచాయతీల్లో ఆయన పర్యటించారు. సుగాలిమిట్టలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం పలు గ్రామాల్లో సీసీ రోడ్లను ప్రారంభించారు. గ్రామ గ్రామాన ఆయనకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.