VIDEO: ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. తప్పిన పెను ప్రమాదం

VIDEO: ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు.. తప్పిన పెను ప్రమాదం

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని వాల్మీకి సర్కిల్ రామాలయం సమీపంలో ఆదివారం ఉదయం ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి నివాస గృహాన్ని డీకొంది. బస్సు వేగంగా వచ్చి నేరుగా ఇంటి గోడను కూల్చివేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఇంటి ముందు భాగం ధ్వంసమైంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.