'మౌలిక వసతుల మెరుగుకు ప్రత్యేక దృష్టి'
CTR: రానున్న వేసవి దృశ్య పట్టణంలో మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ భాష ఆదేశించారు. శనివారం పుంగనూరు పురపాలక కార్యాలయంలో కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. అజెండాలోని 10 అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. పట్టణంలో ప్రజలకు ఎలాంటి సమస్య రాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.