అభిషేకాలు నిర్వహించిన ఆలేరు ఎమ్మెల్యే
BHNG: యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. గ్రామ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసిన ఆయనకు ఆలయ అర్చకులు ఆశీర్వాదాలు అందజేశారు.