కట్టావారిపాలెంలో 40 మందికి వైద్య సేవలు

ప్రకాశం: పొన్నలూరు మండలంలోని కట్టావారిపాలెం గ్రామంలో 'మన ఊరి ఆరోగ్య వికాసం' ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించి 40 మందికి ఉచిత వైద్య పరిక్షలు చేశారు. ఒంగోలు దేవి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కంకణాల కృష్ణ మోహన్, ఆసుపత్రి సిబ్బంది శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.