ఫైజాబాద్ గ్రామ దేవతలకు ఘనంగా బోనాలు
MDK: చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలో ఉగాది పండుగను పురస్కరించుకుని రెండో రోజు గ్రామ దేవతలకు బోనాల ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. భక్తులు అగ్గిగుండాలు తొక్కి, అమ్మవార్లకు ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పోచమ్మ తల్లిని కొలుస్తూ, గ్రామం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలు, తోరణాలతో అలకరించారు.