విద్యార్థులకు అవగాహన సదస్సు

కామారెడ్డి: మద్నూర్ మండల కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన గ్రామ సభలో కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ రాజేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్ ఉంటుందని అన్నారు. విద్యార్థులు ఐఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశానికి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు 4 మార్కులు అధికంగా కలుపుతారని చెప్పారు.