'విద్యార్థులకు శాపంగా మారిన జీవోను రద్దు చేయాలి'
AKP: పీ.జీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షలు బీ. బాబ్జి డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో ఎలమంచిలి పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మానవహారం నిర్వహించి అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలని కోరారు.