అకాల వర్షానికి మొక్కజొన్న పంట నష్టం

అకాల వర్షానికి మొక్కజొన్న పంట నష్టం

NDL: ఇటీవల కురిసిన అకాల వర్షాలతో కొత్తపల్లి మండలంలో మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గురువారం కురిసిన వర్షానికి పంటలు నేలకొరిగి రైతులు నష్టపోయారు. చేతికొచ్చే దశలో ఉన్న పంట నష్టంతో రైతులు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపాడు గ్రామంలో ఎక్కువగా నష్టం జరిగిందని రైతులు తెలిపారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.