గంగమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు

NDL: మండలంలోని సీతారామపురం, సంకలాపురం గ్రామాల్లో వెలసిన గంగమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గంగమ్మ ఆలయంలో అర్చకులు నాగేంద్ర ఆధ్వర్యంలో మహిళలు సామూహికంగా అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు.