సీఎంకు మరో చేదు అనుభవం

సీఎంకు మరో చేదు అనుభవం

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఇటీవల ఓ దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని గాంధీనగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. దీంతో పోలీసులు, కార్యకర్తలు ఆ వ్యక్తిని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.