మహానంది క్షేత్రంలో భక్తుల తాకిడి

NDL: జిల్లాలోని ప్రసిద్ధ గాంచిన మహానంది పుణ్యక్షేత్రంలో సోమవారం స్వామివారికి ప్రీతికరం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున నుంచి ఆలయ ఆవరణలోని కోనేరుల్లో పుణ్య స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. ఆ తర్వాత స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులకు ఏ లోటు రానివ్వకుండా దేవస్థానం ఏర్పాట్లు చేశారు.