మీర్జాగూడ బస్సు ప్రమాదంలో 13 మంది మహిళలే

మీర్జాగూడ బస్సు ప్రమాదంలో 13 మంది మహిళలే

RR: చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సోమవారం బస్సులో 70 శాతం ప్రయాణికులు మహిళలే ఉన్నట్లు తెలిసింది. మృతుల్లో 13 మంది మహిళలు కల్పనా, గున్నమ్మ, తారీబాయి, అఖిల, నాగమణి, తబస్సుమ్ జాన్, నందిని, సాయిప్రియ, తనుషా, వెంకటమ్మ, లక్ష్మి, సెలా, ముస్కాన్ బేగం ఉన్నారు. మరో ఆరుగురు పురుషులు ఉన్నారు.