నూజివీడులో డ్రైనేజీ ప్రక్షాళన

నూజివీడులో డ్రైనేజీ ప్రక్షాళన

ELR: నూజివీడు పట్టణంలోని బ్యాంక్ స్ట్రీట్‌లో గల పోస్టాఫీస్ వద్ద పూడుకుపోయిన డ్రైనేజీలో ఆదివారం చెత్తను తొలగించారు. మున్సిపల్ సిబ్బంది డ్రైనేజీలో పూడిక తీయడం వలన మురుగునీరు ముందుకు ప్రవహించింది. ఇప్పటివరకు దుర్గంధం వ్యాప్తి చెందడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. డ్రైనేజీ పరిశుభ్రం చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.