ఒక్క ఓటుతో సర్పంచ్‌గా గెలిచాడు.!
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం రాజమాన్ సింగ్ తండా సర్పంచ్ అభ్యర్థి గుగులోతు పటేల్ విజయం సాధించారు. ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో తన సమీప ప్రత్యర్థి జాటోత్ కుమార్‌పై ఒక్క ఓటు తేడాతో పటేల్ గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేశారు.