'పెద్ది'లో స్టార్ హీరోయిన్ ఫిక్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు క్రేజీ కాంబోలో తెరకెక్కుతోన్న చిత్రం 'పెద్ది'. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించిన విషయం తెలిసిందే. తాజాగా ఇందుకు మృణాల్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ ప్రారంభంకానుందట. ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.