జాతీయ జెంబోరీలో జిల్లా విద్యార్థులు ప్రతిభ
అన్నమయ్య: లక్నోలో జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 19వ జాతీయ జెంబోరీలో ప్రతిభ కనబరిచిన అన్నమయ్య జిల్లా విద్యార్థులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, DEO సుబ్రహ్మణ్యం గురువారం అభినందించారు. నవంబర్ 22-29 వరకు జరిగిన ఈ జెంబోరీలో 35 వేల మంది పాల్గొనగా, జిల్లా నుంచి 62 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉపాధ్యాయుడు గురునాథరెడ్డి కంటిన్జెంట్ లీడర్‌గా వ్యవహరించారు.