వితంతు పెన్షన్‌లకు దరఖాస్తు ఆహ్వానం

NLR: విడవలూరు మండలంలోని డిసెంబర్ 2023 నుంచి అక్టోబర్ 2024 మధ్యకాలంలో చనిపోయిన వృద్ధాప్య పెన్షన్ దారుని యొక్క భార్యకు వితంతు పెన్షన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎంపీడీవో నగేష్ కుమారి గురువారం ప్రకటన తెలిపారు. దీనికోసం అర్హత గల వితంతువులు స్థానిక గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.