మలికిపురంలో మిస్సింగ్ కేసు నమోదు: ఎస్సై సురేష్

మలికిపురం మండలం దిండి గ్రామానికి చెందిన బెల్లంకొండ చంద్రశేఖర్ (45) అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేశామని మలికిపురం ఎస్సై సురేష్ మంగళవారం తెలిపారు. ఈ నెల ఏడవ తేదీ సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడని అప్పటి నుంచి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. కుటుంబ సభ్యులు బంధువుల ఇంటి వద్ద గాలించినప్పటికీ ఆచూకీ తెలియలేదు.