'పంటలకు నష్టపరిహారం ప్రకటించాలి'
KMM: అకాల వర్షాలతో రైతంగానికి తీవ్ర నష్టం జరిగిందని, పంటలకు నష్టపరిహారం ప్రకటించాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు డిమాండ్ చేశారు. ఎర్రుపాలెం మండలం మామునూరు, భీమవరం గ్రామాలలో పత్తి, మిరప, వరి పంటలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎకరానికి 30 వేలు రైతులకు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.