ముస్లిం కమ్యూనిటీ హాల్‌కు రూ .1.5 కోట్లు మంజూరు

MLG: ఏటూరునాగారం మండలంలోని కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.50 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల మంజూరు పట్ల ఏటూరునాగారం ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేసాయి. ఈ అభివృద్ధికి కృషి చేసిన మంత్రి సీతక్కకు మండల కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలిపింది. ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి తమ అభివృద్దికి దోహదం చేస్తుందని వారు తెలిపారు.