కార్యకర్తలతో టీ తాగుతూ సందడి చేసిన ఎమ్మెల్యే
MHBD: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శనివారం రాత్రి పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తొర్రూరు పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రజలను కలిసి ప్రచారం చేశారు. నిరంతర ప్రచార కార్యక్రమాల అనంతరం కొద్దిసేపు సేద తీరేందుకు పక్కనే ఉన్న ఓ హోటల్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కార్యకర్తలతో కలిసి టీ తాగుతూ సందడి చేశారు.