హైస్కూల్‌లో విద్యార్థులకు వైద్య పరీక్షలు
ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని స్థానిక హైస్కూల్‌లో గురువారం ప్రముఖ దంత వైద్య నిపుణులు కిరణ్ కుమార్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు పంటి సంరక్షణ గురించి పలు సూచనలు ఇవ్వటం జరిగింది. పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయాన్నే బ్రష్ చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.