ఇందిరమ్మ ఇళ్లకు ఎమ్మెల్యే భూమి పూజ

KNR: తిమ్మాపూర్ మండలం అలుగునూర్ 7వ డివిజన్ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఆదివారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆషాఢ మాసంలో ఇంటి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, శ్రావణ మాసం ఇళ్ల నిర్మాణానికి శుభప్రదం అని తెలిపారు.