'రోగుల వివరాలు డిజిటల్ రూపంలో నమోదు చేయాలి'
SRD: రోగులకు సంబంధించిన పూర్తి వివరాలు డిజిటల్ రూపంలో నమోదు చేసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. సంగారెడ్డి మెడికల్ కళాశాల కాన్ఫరెన్స్ శిక్షణ సమావేశం శుక్రవారం నిర్వహించారు. జోగిపేట, పటాన్ చెరు, సదాశివపేట ఏరియా ఆసుపత్రితో పాటు సంగారెడ్డి డివిజన్ పరిధిలోని 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వెంటనే ప్రారంభించాలన్నారు.