మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పరిధిలో సమస్యల పై ఫిర్యాదులు
MDCL: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ విభాగాలకు సంబంధించిన మొత్తం 28 దరఖాస్తులు అందాయి. ఇందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి 18, ఇంజినీరింగ్ విభాగానికి 7, H&S, HMWS, UBD విభాగాలకు 3 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి స్వీకరించారు. సంబంధిత విభాగాల ద్వారా త్వరితగతిన పరిష్కార చర్యలు తీసుకోవాలన్నారు.