VIDEO: ఎస్సై జాబ్ వదులుకుని..సర్పంచ్‌గా పోటీ.. !
SRPT: స్వగ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో కోదాడ టౌన్ ఎస్సై పులి వెంకటేశ్వర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో ఐదు నెలల సర్వీస్ ఉండగానే కోదాడ మండలం గుడిబండ గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు వీఆర్ఎస్ తీసుకున్నారు. పుట్టిన ఊరికి సేవ చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలియజేశారు.