తిరుపతి గరుడ వారధి పై బర్త్ డే వేడుకలు చేస్తున్నారా?

TPT: తిరుపతిలోని గరుడ వారధిపై ఎవరూ వాహనాలు నిలపవద్దు. ఫైఓవర్‌పై ఎలాంటి బర్త్ డే వేడుకలు చేసుకోకండి. ఎందుకంటే గరుడ వారధిపై సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇటీవల ఓ యువతి, యువకుడు అక్కడ బర్త్ డే వేడుకలు చేసుకున్నారు. సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించి అక్కడికి బయల్దేరారు. పోలీస్ సైరన్ విని వారిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.