VIDEO: అనపర్తి కెనాల్ రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే
E.G: నవంబర్ నెలాఖరులోపుగా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి కాకినాడ రాజమహేంద్రవరం కెనాల్ రోడ్డు మరమ్మతు పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్పారు. అనపర్తిలో వర్షాలు కారణంగా అధ్వానంగా తయారైన కెనాల్ రోడ్డును ఆయన శుక్రవారం పరిశీలించారు. ఆర్ అండ్ బి ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు.