ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

NLR: వింజమూరులో MLA కాకర్ల సురేష్ సోమవారం ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. TDP పార్టీ కార్యాలయంలో రెవెన్యూ, రహదారులు, తాగునీరు, విద్యుత్, పింఛన్ల వంటి అంశాలపై ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి, అవసరమైతే ప్రత్యక్షంగా పరిశీలించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.