అహోబిలంలో కళింగ నర్తన ఉత్సవం

అహోబిలంలో కళింగ నర్తన ఉత్సవం

NDL: ఆళ్లగడ్డ మండలం అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఎగువ అహోబిలంలో ఇవాళ జ్వాల నరసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు కళింగ నర్తన ఉత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను పల్లకిపై కొలువుంచి తిరువీధిలో ఊరేగించారు. రాత్రి అశ్వహనంపై స్వామి విహరించనున్నారు.