రైస్ మిల్లులో ఆర్డీవో తనిఖీలు

రైస్ మిల్లులో ఆర్డీవో తనిఖీలు

BPT: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లకు బాపట్ల యంత్రాంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఆర్డీవో గ్లోరియా ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ బృందం బుధవారం రైస్ మిల్లుల్లో తనిఖీలు చేపట్టింది. బాపట్లలోని వెంకట నాగసాయి ట్రేడర్స్‌ను సందర్శించి, ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టాక్ నిల్వలు, యార్డ్ సదుపాయాలు, భద్రతా ప్రమాణాలను అధికారుల బృందం తనిఖీ చేసింది.