మధిర సిద్ధివినాయక స్వామి హుండీ ఆదాయం ఎంతంటే..?

మధిర సిద్ధివినాయక స్వామి హుండీ ఆదాయం ఎంతంటే..?

KMM: మధిర శ్రీ సిద్ధివినాయక స్వామి దేవస్థానంలో మంగళవారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఖమ్మం విభాగ పరిశీలకుల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో 3 నెలలకు గానూ రూ.71,133 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆలయ ఈవో సీహెచ్.రామకోటేశ్వరరావు, అర్చకుడు హరి రవిశాస్త్రి, భక్తులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి ఈ నిధులు వినియోగించనున్నట్లు  ఈవో తెలిపారు.