పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే
JGL: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన 41 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.12,54,000 విలువ గల చెక్కులను శనివారం జగిత్యాల మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.