బాధ్యతలు స్వీకరించిన ఉయ్యూరు నూతన కమిషనర్
కృష్ణా: ఉయ్యూరు నూతన మున్సిపల్ కమిషనర్‌గా ఎం.సుభాష్ చంద్రబోస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. పట్టణ అభివృద్ధి, పారిశుధ్యం, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని కమిషనర్ తెలిపారు. ప్రజలతో సమన్వయం చేసుకుంటూ పారదర్శక పాలన అందిస్తానని హామీ ఇచ్చారు.