చేపలు పడుతూ విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

చేపలు పడుతూ విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

NRML: మామడ మండలం తాండ్ర గ్రామ సమీపంలోని చెక్‌డ్యామ్‌లో చేపలు పట్టే సమయంలో విద్యుత్ షాక్ తగిలి రాథోడ్ సతీష్ (26) అనే వ్యక్తి ఇవాళ మృతి చెందాడు. కరెంట్ వైర్‌తో చేపలు పట్టే క్రమంలో కాలుజారి తీగ తగలడంతో ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.