పింఛన్లు పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్

పింఛన్లు పంపిణీ చేసిన మున్సిపల్ కమిషనర్

ATP: గుత్తిలోని పలు వార్డుల్లో సోమవారం సచివాలయ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేస్తున్న సామాజిక భద్రతా పింఛన్లను మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఉదయం 6 గంటల నుంచే ఇంటింటికి తిరుగుతూ పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. పింఛన్ల పంపిణీలో సాంకేతిక లోపం తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని సచివాలయ సిబ్బందికి సూచించారు.