'ఆపరేషన్ సింధూర్‌'పై పాక్ జర్నలిస్ట్ కీలక వ్యాఖ్యలు

'ఆపరేషన్ సింధూర్‌'పై పాక్ జర్నలిస్ట్ కీలక వ్యాఖ్యలు

భారత ప్రభుత్వం ఇటీవల చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' విజయవంతమైందని పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ డాక్టర్ ఖమర్ చీమా స్పష్టం చేశారు. పాక్‌పై భారత్ జరిపిన దాడిలో ప్రధాని మోదీ 200 శాతం విజయం సాధించారని అన్నారు. 'మోదీ మన ఇంట్లోకి(పాకిస్తాన్) ప్రవేశించి మన ప్రజలను చంపారు. మన దేశ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు' అని ఖమర్ చీమా ఆవేదన వ్యక్తం చేశారు.