శివ స్వాముల శ్రీశైల జ్యోతిర్ముడి యాత్రను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

శివ స్వాముల శ్రీశైల జ్యోతిర్ముడి యాత్రను ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

నల్గొండ జిల్లా: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో ఉన్న నూతన శివాలయం శివదీక్ష స్వాములు శ్రీశైలం వెళుతున్న సందర్భంగా శ్రీశైల జ్యోతిర్ముడి యాత్రను మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు సోమవారం జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, దైవచింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు.