నేదునూరులో నారింజ రంగు తల పక్షి ప్రత్యక్షం
కోనసీమ: అటవీ ప్రాంతాల్లో జీవించే నారింజ రంగు తల పక్షి (ఆరెంజ్ హెడెడ్ థ్రష్) అయినవిల్లి మండలం నేదునూరులో కనువిందు చేసింది. దీనికి తల నుంచి ఉదర భాగం అంతా నారింజ, రెక్కలు నీలిరంగుల్లో ఉన్నాయి. ఈ రకం పక్షులు పురుగులు, కీటకాలు, పండ్లను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి విత్తన వ్యాప్తిలో ప్రధాన పాత్ర పోషిస్తాయని కోరంగి అభయారణ్యం ఫారెస్ట్ బీట్ అధికారి కోన మహేష్ తెలిపారు.