కరాటే శిక్షణను పరిశీలించిన ఎంఈవో
ELR: ముదినేపల్లి మండలం సింగరాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీలకు నిర్వహిస్తున్న కరాటే శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఎంఈవో నరేశ్ కుమార్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినీల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి, స్వీయరక్షణ కరాటే దోహదపడుతుందని అన్నారు. పాఠశాల స్థాయి నుంచే అందిస్తున్న శిక్షణను సద్వినియోగపరుచుకోవాలని సూచించారు.