'విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి'
VSP: విద్యార్థులు-యువతతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని మాజీ MLA వాసుపల్లి గణేష్‌కుమార్ సోమవారం హెచ్చరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిరుద్యోగ భృతి, సూపర్ సిక్స్ పేరుతో యువతను మోసం చేశారని కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. 30వ వార్డు యువత పెద్దఎత్తున వైసీపీలోకి చేరారు.